WHO: కొత్త రూపాల్లో కలవరపెడుతున్న కరోనా మహమ్మారి

WHO: ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Update: 2022-01-05 07:15 GMT

ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

WHO: కొవిడ్ కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని భయపెట్టిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి రెండేళ్ల తర్వాత కూడా కొత్త రూపాల్లో దూసుకొస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సెకండ్ వేవ్‌లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా మారింది ఒమిక్రాన్. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో సునామీ తరహాలో విస్తరిస్తూ ఆసియా దేశాల్లోనూ లాక్‌డౌన్‌లకు కారణమైంది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో మరిన్ని కొత్త, అత్యంత ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత భయపడినదానికంటే తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ వేరియంట్‌ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని W.H.O. సీనియర్‌ ఎమర్జెన్సీస్‌ ఆఫీసర్‌ కేథరిన్‌ స్మాల్‌వుడ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నామని, ఇన్ఫెక్షన్‌ రేటు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోందన్నారు. అందువల్ల ఒమిక్రాన్‌ ఉద్ధృతిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేమని కేథరిన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News