WHO: ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి

*మహమ్మారి ఇంకా అంతం కాలేదన్న WHO రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ *కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి

Update: 2021-12-12 14:00 GMT

ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి: WHO

WHO: ఒమిక్రాన్ వ్యాప్తి, భారత్‌లో థర్డ్ వేవ్ అంచనాలపై WHO రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్పందించారు. మహమ్మారి ఇంకా అంతం కాలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని, ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు.

ఒమిక్రాన్ కొద్దికాలంలోనే ప్రపంచమంతా వ్యాపించడం చూస్తుంటే దీని ప్రభావం తీవ్రస్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.అయితే, కొత్త వేరియంట్ ఎలాంటి లక్షణాలు కలిగిస్తుంది? ఇన్ఫెక్షన్ తీవ్రత, విస్తరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, అందుకే ప్రపంచ దేశాలు సహకరించాలని పూనమ్ ఖేత్రపాల్ సూచించారు.

Tags:    

Similar News