అమెరికా నుంచి లెబనాన్ డాక్టర్ బహిష్కరణ: ఎవరీ రాషా అలవీ?

Update: 2025-03-18 13:20 GMT

అమెరికా నుంచి లెబనాన్ డాక్టర్ బహిష్కరణ: ఎవరీ రాషా అలవీ

రాషా అలవీ అనే లెబనాన్ డాక్టర్ ను తమ దేశం నుంచి అమెరికా బహిష్కరించింది. హెజ్‌బొల్లాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ అమెరికా ఆమెను బహిష్కరించింది. లెబనాన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆమె అమెరికా చేరుకున్నారు. ఆమెను బోస్టన్ ఎయిర్ పోర్టులోనే అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఎవరీ రాషా అలవీ?

బ్రోన్ మెడిసిన డివిజ్ ఆఫ్ కిడ్నీ డీసీస్, హైపర్ టెన్షన్ ఇన్ రోడ్ ఐలాండ్ లో 2024 జులై నుంచి ఆమె పనిచేస్తున్నారు.2015 లో అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బైరూట్ మెడికల్ డిగ్రీని ఆమె పొందారు. ఆతర్వాత ఆమె బ్రోన్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. ఇదే సంస్థలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.బ్రోన్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం జరగడానికి ముందు ఓహియో స్టేట్ యూనివర్శిటీ, వాషింగ్టన్ యూనివర్శిటీ పరిధిలో ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.హెచ్ 1 బీ వీసా కూడా ఆమెకు మంజూరైంది. 2027 మధ్య నాటి వరకు హెచ్ 1 బీ వీసా గడువు ఉంది.

సోషల్ మీడియాలో వైట్ హౌస్ పోస్టు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బై చెబుతున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసి బైబై రాషా అంటూ వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.హెజ్‌బొల్లా మాజీ చీఫ్ హస్ నస్రల్లా అంత్యక్రియలకు ఆమె హాజరయ్యారని దర్యాప్తులో అంగీకరించారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆమె ఫోన్ లో నస్రల్లా, ఇతర హెజ్ బొల్లా నేతల ఫోటోలున్నాయని పోలీసులుచెబుతున్నారు. బోస్టన్ కు చేరుకునే ముందు ఈ ఫోటోలను ఆమె తొలగించారని చెప్పారు.

Tags:    

Similar News