వైట్ హౌస్ పై దాడిలో 8 ఏళ్ల జైలు: ఎవరీ సాయి వర్షిత్?

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడికి పాల్పడిన కేసులో తెలుగు సంతతికి చెందిన సాయి వర్షిత్ కు ఎనిమిది ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

Update: 2025-01-17 10:48 GMT

Sai Varshith Kandula: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడికి పాల్పడిన కేసులో తెలుగు సంతతికి చెందిన సాయి వర్షిత్ కు ఎనిమిది ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. నాజీ భావజాలంతో డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని జడ్జి డాబ్నీ ఫ్రెడిచ్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడిని హత్య చేయడం, కిడ్నాప్ లేదా అధ్యక్షుడికి హని చేయడం వంటి ఆరోపణలతో అమెరికా పార్క్ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ నేరాన్ని ఆయన అంగీకరించారు.

మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి కమర్షియల్ విమానంలో 2023 మే 22న వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నారు.

రాత్రి 9.35 గంటలకు ట్రక్కుతో వైట్ హౌస్ బారియర్లను ట్రక్కుతో ఢీకొట్టారు. ఆ తర్వాత ట్రక్కు మొరాయించింది. బ్యాక్ ప్యాక్ నుంచి నాజీ జెండా ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైట్ హౌస్ లో అధికారాన్ని దక్కించుకోవాలని ట్రక్కుతో దాడికి దిగినట్టు వర్షిత్ పోలీసుల విచారణలో చెప్పారు.

అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడి కుటుంబంపై దాడి చేయడం కూడా అతని లక్ష్యమని పోలీసులు విచారణలో గుర్తించారు.ఆరు నెలలపాటు అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. అమెరికాలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు వర్షిత్ పై అభియోగాలు మోపారు. వర్షిత్ నుంచి నాజీ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో ఆయన ఈ జెండాను కొన్నారు.

సాయి వర్షిత్ స్కిజో‌ప్రెనియాతో బాధపడుతున్నారని ఈ కేసు విచారణ సమయంలో డిఫెన్స్ అటార్నీ కోర్టుకు తెలిపారు. వైట్ హౌస్ పై దాడికి ప్రయత్నించినట్టు వర్షిత్ ఒప్పుకున్నారని యుఎస్ అటార్నీ కార్యాలయం 2024 మే 13న ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎవరీ సాయివర్షిత్?

కందుల సాయి వర్షిత్ తల్లిదండ్రులు ఇండియా నుంచి చాలా కాలం క్రితమే అమెరికాకు వలస వెళ్లారు.2022లో ఆయన మార్ క్వీట్ హైస్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అతని లింక్‌డిన్ ప్రొఫైల్ ఆధారంగా డేటా అనలిస్ట్, కోడింగ్ లాంగ్వేజ్ లో ఆయన ఎక్స్‌పర్ట్. టెన్నిస్ ఆట అంటే ఆయనకు ఇష్టం.స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడేవారు. చదువులో కూడా టాపర్ గా ఆయన స్నేహితులు చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనంపై దాడికి సాయివర్షిత్ దిగారంటేఆయన స్నేహితులు నమ్మలేదు.

Tags:    

Similar News