Heavy Floods in Southern Japan: రాత్రికి రాత్రే భారీ వర్షాలు, వరదలు.. పలువురు గల్లంతు

Heavy Floods in Southern Japan: దక్షిణ జపాన్‌లో శనివారం కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చాయి.

Update: 2020-07-04 09:15 GMT

Heavy Floods in Southern Japan: దక్షిణ జపాన్‌లో శనివారం కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చాయి. భారీ వర్షం ప్రభావానికి అక్కడ కుమా నది పొంగి పొర్లింది. దాంతో హితోయోషి పట్టణం నీట మునిగింది.. దానిని అనుకోని ఉన్న పలు ప్రాంతాలు ప్రవాహానికి మునిగిపోయాయి. శుక్రవారం రాత్రి సంభవించిన ఈ ఆకస్మిక వరదలతో ఇద్దరు మృతి చెందగా, దాదాపు 11 మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్దీ పైకప్పులపై చిక్కుకున్నారు. కార్లు, వాహనాలు నీటిలో మునిగిపోయాయి. కుమమోటో, కాగోషిమా ప్రాంతాలకు చెందిన సుమారు 75,000 మందిని పైగా నివాసితులను రాత్రికి రాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వర్షం కురుస్తున్న సమయంలోనే వారిని ఖాళీ చేయమని అధికారులు కోరడంతో గందరగోళం ఏర్పడింది. ఎవరు ఎక్కడికి వెళ్లారో అర్ధం కానీ పరిస్థితి తలెత్తింది. ఈ గందరగోళంలో దాదాపు పదమూడు మంది గల్లంతయ్యారు. అయితే వారిలో ఇద్దరి మృతదేహాల ఆచూకీ మాత్రం దొరికింది.

కుమా అనే గ్రామంలో చిక్కుకున్న నివాసితులను రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా తరలించారు. హిటోయోషి నగరంలో, రక్షకులు కొంతమంది నివాసితులను పడవలో తరలించారు.మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రధాని షింజో అబే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈమేరకు జపాన్‌ స్థానిక మీడియా ఈ వార్తను ప్రచురించింది. కాగా, టోక్యోకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్‌ వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రజలు మాత్రం దీనిని అంతగా పట్టించుకోలేదు. దాంతో బాధితుల తరలింపు ప్రక్రియ ఆలస్యంగా జరిగింది.


Tags:    

Similar News