Russia vs Ukraine War: క్లస్టర్ బాంబులకు కొదువే లేదు, కౌంటర్ ఎటాక్‌కు రెడీ: ఉక్రెయిన్‌ను హెచ్చరించిన పుతిన్..!

Russia vs Ukraine War: రష్యాలో తగినంత క్లస్టర్ బాంబులు ఉన్నాయని, వాటిని ఉక్రెయిన్ ఉపయోగిస్తే ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా సరఫరా చేసిన క్లస్టర్ బాంబులు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయని పెంటగాన్ తెలిపింది.

Update: 2023-07-18 06:04 GMT

Russia vs Ukraine War: క్లస్టర్ బాంబులకు కొదువే లేదు, కౌంటర్ ఎటాక్‌కు రెడీ: ఉక్రెయిన్‌ను హెచ్చరించిన పుతిన్..

Russia vs Ukraine War: రష్యా వద్ద క్లస్టర్ బాంబుల "గణనీయమైన నిల్వలు" ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం అన్నారు. ఉక్రెయిన్ వివాదాస్పద ఆయుధాన్ని ఉపయోగిస్తే "ప్రతీకారం తీర్చుకునే హక్కు" రష్యాకు ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబుల సరఫరాపై పుతిన్ ఆదివారం ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌లో రష్యా తన యుద్ధంలో క్లస్టర్ బాంబులను ఇంకా ఉపయోగించలేదని చెప్పుకొచ్చాడు. "ఇప్పటి వరకు, మేం వీటిని ప్రయోగించలేదు. మాకు దాని అవసరం ఇంకా రాలేదు" అని తెలిపాడు.

రష్యా, ఉక్రెయిన్ రెండూ క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు విస్తృతంగా వార్తలు వినిపించింది. రష్యా దాడుల తరువాత క్లస్టర్ బాంబులు వెలుగు చూశాయి. రష్యా టీవీ రిపోర్టర్ పావెల్ జరుబిన్ ఆదివారం తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రచురించారు. అమెరికా సరఫరా చేసిన క్లస్టర్ బాంబులు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయని పెంటగాన్ గురువారం తెలిపింది. ఒక క్లస్టర్ బాంబు గాలిలో ఎత్తు నుంచి విసురుతారని, దాని లోపల నుంచి వేలాది చిన్న బాంబులు విడుదల అవుతాయని, ఇది లక్ష్యంగా ఉన్న ప్రదేశంలో భారీ విధ్వంసం కలిగిస్తుంది. గతంలో క్లస్టర్ బాంబుల వల్ల చాలా మంది చనిపోయారు. చాలా దేశాలు క్లస్టర్ బాంబులను ఉపయోగించకుండా ఉండటానికి ఇదే కారణం.

గత వారం యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ తుది నిర్ణయం తీసుకునే ముందు, యూఎస్ నాయకులు నెలల తరబడి ఈ సమస్యపై చర్చించారు. ఉక్రెయిన్ వాటిని జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉపయోగిస్తామని హామీ ఇచ్చింది. గడచిన 24 గంటల్లో రష్యా రెండు ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్‌ల ద్వారా దాడులు చేసిందని, రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, రెండు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులను ప్రయోగించిందని, అదనంగా 40 వైమానిక దాడులు, రాకెట్ లాంచర్‌ల నుంచి 46 దాడులు చేశారని ఉక్రెయిన్ సైన్యం ఆదివారం ఉదయం తెలిపింది.

డోనెట్స్క్ గవర్నర్ పావ్లో కిరిలెంకో ఆదివారం మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని ఇద్దరు నివాసితులు శనివారం మరణించారని, మరొకరు గాయపడ్డారని చెప్పారు. ఉక్రేనియన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రకారం, దేశంలోని ఇతర చోట్ల, రష్యా మిలిటరీ వదిలిపెట్టిన పేలుడు పరికరం ఆదివారం ఖేర్సన్ దక్షిణ ప్రాంతంలో పేలడంతో ఎనిమిది, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు గాయపడ్డారు. గవర్నర్ అలెగ్జాండర్ ప్రోకుడిన్ మాట్లాడుతూ రష్యా ఖెర్సన్ ప్రాంతంలోకి 69 షెల్స్‌ను ప్రయోగించిందని తెలిపారు.

Tags:    

Similar News