భారత్‌తో మిలిటరీ యుద్ధం ఉండదు.. అణు యుద్ధమే

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Update: 2019-10-23 12:04 GMT

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌ ప్రధానితో సహా కొందరు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవలే పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తో ఇక అణు తప్పదంటూ వ్యాఖ్యానించారు. భారత్ సైన్యంతో యుద్ధం ఉండదని, అణు యుద్ధమే చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు చివరిలోగా భారత్ పాక్ యుద్ధం జరుగుతోందని అన్నారు. రషీద్ వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించలేదు. రషీద్ గతంలోనూ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.  

Tags:    

Similar News