వైరల్.. ఈ కుక్క బైకు మీద ఇద్దరిని ఎక్కించుకుని ఎలా డ్రైవ్ చేస్తుందో చూడండి
కుక్కలు బైకు నడపడాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. అయితే ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారు, సంఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. క్లారా జో బర్గ్ అనే యువతి తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన యజమానితోపాటు మరో వ్యక్తిని వెనుకాల కూర్చొబెట్టుకుని మరీ ఆ కుక్క వేగంగా బైకు నడపడం గమనార్హం.
They see me rollin pic.twitter.com/59HxNpqLPA
— Klara Sjöberg (@klara_sjo) October 26, 2019