Viral Video: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్..చెంప చెళ్లుమనిపించిన భార్య..!!
Viral Video: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్..చెంప చెళ్లుమనిపించిన భార్య..!!
Viral Video: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చెంప చెళ్లుమనింపించింది ఆయన భార్య. ఆయన సోమవారం వియాత్నం పర్యటనకు వెళ్లారు. ఈక్రమంలో విమానం దిగుతుండగా మాక్రాన్ చెంపపై ఆయన భార్య కొడుతున్నట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది.
అధ్యక్షుడిని ఆయన భార్య కొట్టలేదని..కేవలం టీజ్ చేసేందుకు అలా చేసిందని తెలిపింది. అయితే దీనిపై మాత్రం నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అధ్యక్షుడిపై అందరి ముందు అలా చేయిచేసుకోవడం దేశాన్ని అవమానించినట్లేనని కొందరు అభిప్రాయపడుతుండగా..మరికొందరు మాత్రం భార్యగా బ్రిగెటి క్లోజ్ గా మూవ్అయ్యారని..అందులో తప్పేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.