Corona Vaccine: భారత్, బ్రిటన్ దేశాల మధ్య వ్యాక్సిన్ వివాదం

Corona Vaccine: కొత్త మెలిక పెట్టిన బ్రిటన్ * అక్టోబరు 4 నుంచి విదేశీ ప్రయాణికులకు కోవిడ్ రూల్స్

Update: 2021-09-23 03:24 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Corona Vaccine: అక్టోబరు 4 నుంచి విదేశీ ప్రయాణికులు తమ దేశానికి వచ్చినప్పుడు పది రోజుల పాటు క్వారంటైన్ పాటించాల్సిందేనని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. అందులో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మినహాయింపు ఇచ్చారు.. కరోనా వ్యాక్సిన్ అంశంలో భారత్, బ్రిటన్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు.. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మెలిక పెట్టింది.. బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసినమార్గదర్శకాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్ జారీ చేసే వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.. కోవిడ్ 19 వ్యాక్సిన్ జాబితాలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ చేరుస్తూ నిబంధనల్ని సవరించారు. అయితే.. కొవిషీల్డ్ తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై భారత్‌ అభ్యంతరం తెలిపింది. భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్ వ్యాక్సిన్‌కి అంగీకరించనప్పటికీ, భారత్ జారీ చేసే ద్రువపత్రం WHO నిబంధనలకు అనుగుణంగా లేదని తేల్చింది. మరోవైపు. WHO మార్గదర్శకాలను అనుగుణంగానే తాము జారీ చేస్తున్నామని భారత్ చెప్తుంది..

Tags:    

Similar News