చంద్రుడిపైకి డ్రోన్ ను పంపిన నాసా: ఎందుకంటే?
చంద్రుడి దక్షిణ దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కోసం ప్రైవేట్ సంస్థ తయారు చేసిన లూనార్ ల్యాండర్ ను నాసా ప్రయోగించింది
చంద్రుడిపైకి డ్రోన్ ను పంపిన నాసా: ఎందుకంటే?
చంద్రుడి దక్షిణ దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కోసం ప్రైవేట్ సంస్థ తయారు చేసిన లూనార్ ల్యాండర్ ను నాసా ప్రయోగించింది. చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ఓ బిలంపైకి డ్రోన్ ను పంపాలనే ప్లాన్ చేసింది.చంద్రుడిపై డ్రోన్ ద్వారా ప్రయోగాలు చేయనున్నారు.
ఇంట్యూటివ్ మెషిన్స్ సంస్థ అభివృద్ది చేసిన అథీనా ల్యాండర్ ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో పంపించింది. ఈ రాకెట్ ఈ ఏడాది మార్చి 6న చంద్రుడి ఉపరితలంపై దిగేలా రూపొందించారు. 15 అడుగుల ఎత్తైన ఈ అథీనా ల్యాండర్ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ ప్రదేశం జెట్ బ్లాక్ బిలానికి 400 మీటర్ల దూరంలో ఉంటుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరిలో అమెరికా, జపనీస్ కంపెనలు చంద్రుడిపైకి ల్యాండర్లను ప,ంపాయి. టెక్సాస్ కంపెనీ ఫైర్ ఫై ఏరోస్పేస్ మరో వారంలో చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై ప్రయోగాలు లేదా ల్యాండింగ్ కోసం చేసే ప్రయత్నాలకు నాసా సపోర్టు చేస్తోంది.
చంద్రుడిపై ల్యాండర్ ను పంపే విషయంలో గతంలో చేసిన పొర పాట్లు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతాన్ని బ్లాక్ బిలంగా పిలుస్తారు. దీనిపైకి గ్రేస్ అనే డ్రోన్ ను పంపడమే దీని ఉద్దేశం. ఈ డ్రోన్ లో హైడ్రోజన్ ప్యుయెల్డ్ థ్రస్టర్లను ఉపయోగించారు. దీంతో డ్రోన్ ఎగిరే అవకాశం ఉంటుంది. నావిగేషన్ కోసం కెమెరా, లేజర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎగిరే సమయంలో జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి.రష్యా, చైనా, యుఎస్, చైనా, ఇండియా, జపాన్ దేశాలు ఇప్పటివరకు చంద్రునిపై అడుగుపెట్టాయి.