Panama:అమెరికాకు ఫ్రీ.. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. పనామా కెనాల్ విషయంలో ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది.

Update: 2025-02-06 12:03 GMT

Panama: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. పనామా కెనాల్ విషయంలో ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో తమ యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేకుండా ఆ దేశం అంగీకరించిదని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే తెలిపారు.

పనామా కాలువను కొనుగోలు చేయాలని గతంలోనే ట్రంప్ కలలు కన్నారు. కానీ అది తీరకముందే పదవిని కోల్పోయారు. రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం అవసరమైతే సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. దీంతో పనామా వెనక్కు తగ్గింది. అమెరికా యుద్ధ నౌకలను పనామా కాలువపై ప్రయాణిస్తే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సి అవసరం లేదని తెలిపింది.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్ పై ప్రయాణిస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. దీని వల్ల అమెరికా ప్రభుత్వ నౌకలకు పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయి. అయితే చాలా రోజుల క్రితమే పనామా, యూఎస్‌కు కొన్నిరాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రుబియో తెలిపారు. కానీ ఇరు దేశాల మధ్య ఒప్పందాల నేపథ్యంలో ఫ్రీగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇక అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా కెనాల్ ద్వారా ప్రయాణించనున్నాయి.

ఇదిలా ఉండగా.. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా 1914లో పనామా కాల్వను నిర్మించింది. దీనిని మొదటిసారి అమెరికానే నిర్వహించింది. పనామా దేశంలో ఆ కాల్వపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు తలెత్తడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పనామా కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండాలని అమెరికా షరతు పెట్టింది. అలాగే ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని తెలిపింది. కెనాల్ ను పనామాకు అప్పగించిన తర్వాత ఆ దేశ ప్రభుత్వం కాలువ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు దానిని దక్కించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Tags:    

Similar News