Delta Variant: యూఎన్‌వోను టచ్‌ చేసిన డెల్టా భయం

* వచ్చే నెల 21 నుంచి యూఎన్‌వో జనరల్‌ అసెంబ్లీ మీటింగ్ * 193 సభ్యదేశాలకు లేఖ రాసిన UNO అమెరికా ప్రతినిధి

Update: 2021-08-23 06:15 GMT

యునైటెడ్ నేషన్స్ (ట్విట్టర్ ఫోటో)

Delta Variant: డెల్టా భయం UNOను టచ్‌ చేసింది. న్యూయార్క్‌లో వచ్చే నెల 21 నుంచి యూఎన్‌వో జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఆయా దేశాల సభ్యులు వీడియో సందేశాలను పంపించాలని అమెరికా కోరింది. 'అత్యున్నత స్థాయి కార్యక్రమాన్ని సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా మార్చవద్దని అమెరికా సూచించింది. ఈ మేరకు ఆ దేశ యూఎన్‌వో ప్రతినిధి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ 193 సభ్యదేశాలకు లేఖ పంపించారు.

అతిథుల భద్రత, న్యూయార్క్‌ వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం వ్యక్తిగత స్థాయిలో హాజరై ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌, జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కూడా అమెరికా నిర్ణయానికి సమ్మతించారు.

యూఎన్‌వో డేటాబేస్‌ ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్‌ 25న ప్రసంగించాల్సి ఉంది. మొత్తం 167 దేశాల ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులుగానీ, దౌత్యవేత్తలుగానీ ఇందులో తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది. 40 దేశాల నేతలు ఇప్పటికే వీడియో సందేశం పంపేందుకు పేర్లు నమోదు చేసుకొన్నారు.

Tags:    

Similar News