బ్రిటన్ ప్రజలకి మరో షాక్ .. ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్

బ్రిటన్ దేశస్థులకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..

Update: 2020-03-27 15:03 GMT
UK's health secretary Matt Hancock

బ్రిటన్ దేశస్థులకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్‌కాక్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనావైరస్ కోసం తాను కరోనా పరీక్షలు చేయించుకున్నాని, అందులో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తేలికపాటి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి ఇంట్లో స్వయంగా పనిచేస్తున్నానని బ్రిటిష్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. ఇలా దేశాధినేతలు ఒకేసారి కరోనా బారినా పడడంతో ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసినట్టు అయింది.

ఇక ఇప్పటి వరకూ బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. మరోవైపు కరోనా వల్ల 578 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక భారత్ లో కుడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 700కి చేరుకోగా, 17 మంది మృతి చెందారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు సంఖ్య 5ల‌క్ష‌లు దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హమ్మారి బారిన ప‌డి 22, 334 మంది మృతిచెందారు. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1, 21, 214 మంది కోలుకున్నారు.  


Tags:    

Similar News