యెమెన్‌లో హౌతీ స్థావరాలపై అమెరికా దాడి

Yemen: 100 గైడెడ్‌ ఆయుధాలు వాడామని వెల్లడి

Update: 2024-01-12 12:06 GMT

యెమెన్‌లో హౌతీ స్థావరాలపై అమెరికా దాడి

Yemen: యెమెన్‌లో హౌతీ స్థావరాలపై తాము దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. 100 గైడెడ్‌ ఆయుధాలు వాడినట్లు పేర్కొంది అగ్రరాజ్యం... అమెరికా సంకీర్ణ దళాలు యెమెన్‌లోని 16 ప్రాంతాల్లో 60 లక్ష్యాలపై దాడులు చేశాయి. వీటిల్లో హౌతీ కమాండ్‌ సెంటర్లు, ఆయుధ డిపోలు, లాంచింగ్‌ వాహనాలు, ఉత్పత్తి కేంద్రాలు, ఎయిర్‌ డిఫెన్స్‌ రాడార్‌ వ్యవస్థలు ఉన్నాయని అమెరికా వాయుసేన వెల్లడించింది. ఈ దాడుల కోసం 100 గైడెడ్‌ ఆయుధాలు ఉపయోగించారు. ఇరాన్‌ అండతో రెచ్చిపోయే సాయుధ గ్రూపుల నుంచి మధ్య ప్రాశ్చ్యంలోని మిత్రులను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి హౌతీలు ముప్పుగా మారారని లెఫ్టినెంట్‌ జనరల్‌ తెలిపారు. యెమెన్‌లో పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

యెమెన్‌పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అమెరికా, యూకే త్వరలోనే తెలుసుకుంటాయని హౌతీ నాయకుడు పేర్కొన్నారు. యెమెన్‌పై యుద్ధం మొదలు పెట్టి అమెరికా, బ్రిటన్‌ పెద్ద తప్పు చేశాయన్నారు. గత అనుభవాల నుంచి వారు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయని, నరమేధం జరిపే వారి పక్షాన నిలొవచ్చని, బాధితుల వైపు ఉండొచ్చన్నారని వెల్లడించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగవని హౌతీ మంత్రి ప్రకటించారు. అమెరికా, బ్రిటన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News