Elon Musk: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో ఎలాన్ మస్క్ సందడి చూశారా?

Update: 2025-01-21 00:32 GMT

Elon Musk: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనం దీనికి వేదికైంది. అమెరికా మాజీ దేశాధ్యక్షులు, ఇతర దేశాల అధినేతలు, అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు తదితర అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రసంగం చేశారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మిత్రుడు, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ట్రంప్ ప్రసంగంలో భాగంగా దేశ సంపదను పెంచుతానని, భూభాగాన్ని విస్తరిస్తానంటూ పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి అమెరికా వ్యోమగాములను పంపిస్తానని ట్రంప్ చెప్పారు. తమ జెండాను అక్కడ పాతుతామన్నారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో మార్స్ గ్రహం అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిగ్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.


కాగా ఎన్నిల ప్రచారం నుంచి గెలించేత వరకు ట్రంప్ నకు మస్క్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రంప్ గెలవడంతో కేబినెట్ లో మస్క్ కు కీలక పదవి అప్పగించారు. ఇక ట్రంప్ ప్రసంగంలో అంగారక గ్రహం అంశం తెరపైకి రావడంతో మస్క్ చేపట్టనున్న ప్రయోగాలకు కొత్త ప్రభుత్వం సహయసహకారాలు పెద్దెత్తున ఉండే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News