Trump: క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ సంచలన నిర్ణయం

Update: 2025-01-21 02:36 GMT

 Trump: క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ సంచలన నిర్ణయం

Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అమెరికా క్యాపిటల్ పై దాడిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.

కాగా 2021 జనవరి 6వ తేదీ నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్ లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. తాజాగా ఆ హామీ మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశం అయ్యింది. ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రపంచం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.  

Tags:    

Similar News