Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం నేడే

Update: 2025-01-20 00:33 GMT

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం ( భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గంటలకు ) పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ట్రంప్ ఫ్లోరిడా నుంచి సైనిక విమానంలో వాషింగ్టన్ కు చేరుకున్నారు. 4ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడారు. ఈసారి ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేశారు. 40ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్ లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి 

Tags:    

Similar News