Donald Trump: అరబ్ దేశాల సంపదను చూసి షాక్ అయిన ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యపోయేలా చేశాయి అరబ్ దేశాలు. అవును ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేత..అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు, బలమైన సైన్యానికి అధిపతి అయిన అమెరికా అధ్యక్షుడు అరబ్ దేశాల సంపదను, విలాసాన్ని చూసి షాక్ అయ్యారు. నాలుగు రోజుల గల్ఫ్ దేశాల పర్యటనలో అరబ్ నేతలు ఇచ్చిన ఆతిథ్యం డొనాల్డ్ ట్రంప్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఖతారీ ప్యాలెస్ లో ఉన్న పాలరాయిని చూసిన ట్రంప్ అద్భుతమంటూ మెచ్చుకున్నారు. దానిని సొంతం చేసుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావచ్చంటూ వ్యాఖ్యానించారు. ఖతార్ ఎమిర్ ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. సౌదీ అరేబియాలోని ధగధగ మెరిసే విమానాలపైనా ఆయన ప్రశంసలు కురిపించారు. వాటితో పోలిస్తే తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎంతో చిన్నదని..ఆకట్టుకునేలా లేదంటూ అభిప్రాయపడ్డారు.
గల్ఫ్ దేశాలు అత్యాధునిక బోయింగ్ 747లను వాడుతున్నాయని..తాను 4 దశాబ్దాల నాటి విమానాన్ని వాడుతున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తన విమానాన్ని మార్చేందుకు ట్రంప్ ఎంతో ఇంట్రెస్టింగ గా ఉన్నారు. ఖతార్ ట్రంప్ నకు బహుమతిగా ఇవ్వజూపిన విమానాన్ని తీసుకునే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో భద్రతాపరమైన అంశాలను, ఆధునికీకరణకు అయ్యే అధిక వ్యవహాన్ని, విదేశీ బహుమతులను స్వీకరించడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయాన్నీ ఆయన పట్టించుకోవాలనుకోవడం లేదు.