Donald Trump: బందీల విడుదలపై హమాస్‌కు ట్రంప్ వార్నింగ్..

గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-02-11 09:03 GMT

బందీల విడుదలపై హమాస్‌కు ట్రంప్ వార్నింగ్..

Donald Trump: గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం మధ్నాహ్నం 12 గంటల వరకు బందీలను విడుదల చేయాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కోసం ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తామని చెప్పారు. అక్కడ మిగిలి ఉన్న బందీలను విడుదల చేయాలని.. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపాలి అని ట్రంప్ స్పష్టం చేశారు.

గాజాను స్వాధీనం చేసుకుని పునర్‌నిర్మిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాలతో పాటు అమెరికా మిత్రదేశాలు సైతం అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రకటనను పాలస్తీనియన్లు తిరస్కరిస్తున్నారని.. వారికి తాము మద్దతిస్తామని ఈజిఫ్టు విదేశాంగశాఖ మంత్రి బాదర్ అబ్దెలాటి తెలిపారు. అలాగే గాజా శరణార్దులను తీసుకురావడానికి జోర్డాన్, ఈజిప్ట్ నిరాకరిస్తే వారికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు.

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 19 నుంచి ఇప్పటివరకు ఇరుపక్షాల మధ్య 5 సార్లు పరస్పర బందీలు, పాలస్తీనీయుల విడుదల జరిగింది. 21 మంది బందీలను హమాస్ విడుదల చేయగా.. బదులుగా 730 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. గాజాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. శనివారం మరికొంత మందిని విడిచిపెట్టాల్సి ఉండగా.. ఇప్పుడు హమాస్ ఇలాంటి ప్రకటన చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

గాజాలో 15 నెలల యుద్ధం అనంతరం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19 నుంచి యుద్ధ విరమణ అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద 21 మంది బందీలరె విడుదల చేశారు. ఇందులో 16 మంది ఇజ్రాయెల్ పౌరులు, ఐదుగురు థాయ్ పౌరులు ఉన్నారు. మరోవైపు సదరు బందీలకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. ఇప్పటికీ 70 మందికిపైగా బందీలు గాజాలో ఉన్నారు.

Tags:    

Similar News