WWII-era US bomb: 80 ఏళ్ల నాటి బాంబు..ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం!
WWII-era US bomb: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ బాంబు హాంకాంగ్‌లో భవన నిర్మాణ పనుల వద్ద బయటపడింది. దాదాపు 80 ఏళ్ల నాటి ఈ బాంబును గుర్తించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
WWII-era US bomb: 80 ఏళ్ల నాటి బాంబు..ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం!
WWII-era US bomb: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ బాంబు హాంకాంగ్‌లో భవన నిర్మాణ పనుల వద్ద బయటపడింది. దాదాపు 80 ఏళ్ల నాటి ఈ బాంబును గుర్తించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయాన్ని హాంకాంగ్ పోలీసు అధికారి ఆండీ చాన్ టిన్ చు మీడియాకు వెల్లడించారు.
బాంబును నిర్వీర్యం చేసేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా, దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 1,900 భవనాల్లోని 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బాంబు దాదాపు 1.5 మీటర్ల పొడవు, 450 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. హాంకాంగ్ ద్వీపంలోని క్వారీ బే జిల్లాలో నిర్మాణ కార్మికులు దీనిని గుర్తించారు.
సుదీర్ఘమైన నిర్వీర్యం ఆపరేషన్
బాంబును నిర్వీర్యం చేసే ఆపరేషన్ శుక్రవారం రాత్రి మొదలై శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్‌లో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దళాలు తమ స్థావరంగా ఉపయోగించుకున్న హాంకాంగ్‌లో, పేలకుండా మిగిలిపోయిన బాంబులు ఇలా తరచుగా బయటపడుతూనే ఉంటాయి. అయితే ఇంత పెద్ద బాంబు బయటపడడం అరుదు.