United Nations: తాలిబన్ల మారణకాండపై స్పందించిన ఐక్యరాజ్యసమితి

United Nations:ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన *అఫ్గాన్-తాలిబన్ల మధ్య చర్చలు జరిగాలన్నUNO సెక్రటరీ జనరల్

Update: 2021-08-14 01:36 GMT

ఐక్య రాజ్య సమితి (ఫైల్ ఇమేజ్)

United Nations: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఆఫ్ఘన్ నగరాల్లో జరుగుతున్న హింసతో భారీ నష్టం జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఖతార్‌లోని దోహాలో అఫ్గాన్, తాలిబన్ల మధ్య జరిగే చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం చూపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు. అఫ్గాన్-తాలిబన్ల మధ్య ఈ వారంలో చర్చలు జరిగితే వివాదం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు గుటెర్రస్ తెలిపారు. వివాద పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. అఫ్గాన్ పౌరులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News