third time president, Donald Trump's key comments, Donald Trump, world news
Trump: అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులను పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా మరో 5లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. త్వరలోనే వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా అక్రమ వలసదారులపై ట్రంప్ వేటు వేస్తున్నారు.
క్యూబా,హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు పేర్కొంది. 2022 అక్టోబర్ తర్వాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. మానవాత పెరోల్ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. వీరంతా ఆర్థిక సహాకారంతో అమెరికాకు వచ్చారని..రెండేళ్లపాటు అమెరికాలో నివసించడానికి పనిచేయడానికి తాత్కాలిక అనుమతులు తీసుకున్నారని హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. వీరు ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్ లో నోటీసులు ప్రచురించిన నెలరోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్ స్టేటస్ ను కోల్పోనున్నారని తెలిపారు.
మానవతా పేరోల్ కింద అమెరికాకు వచ్చేవారు రెండేళ్లపాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసాకోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు దేశాలకు సంబంధించిన 5 లక్షల నివాసాలను అమెరికా రద్దు చేసింది.