కాబూల్‌ ఎయిర్‌పోర్టులో వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేట్ రైస్ రూ.7500

* ఎయిర్‌పోర్టులో ధరలు పెంచేసిన వైనం * విమానాశ్రయంలో స్థానిక ఆఫ్ఘన్ కరెన్సీ తీసుకోని సిబ్బంది

Update: 2021-08-26 07:45 GMT

కాబుల్ ఎయిర్ పోర్ట్ (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్లు భారత కరెన్సీలో దాదాపు 3వేల రూపాలయకు చేరింది. ఇక ప్లేట్‌ రైస్‌కు వంద డాలర్లు భారత కరెన్సీలో 7500 రూపాల ఖర్చు చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఇదిలాఉంటే స్థానిక ఆఫ్ఘన్‌ కరెన్సీని విమానాశ్రయంలో తీసుకోవడం లేదు. కేవలం డాలర్లు మాత్రమే అనుమతి ఇస్తుండడంతో ఆఫ్ఘన్‌ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ఆకలి దప్పికతో అలమటిస్తున్నారు. మరో వైపు పిల్లల పరిస్థితి దారుణంగా తయారైంది.

ప్రస్తుతం విమానాశ్రయం వద్ద దాదాపు 50వేల మంది వరకు జనం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయటపడేందుకు విమానాశ్రయానికి చేరుతున్నారు. ఇందులో కొంత మందిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తుండడంతో వేలాది మంది వెలుపల నిరీక్షిస్తున్నారు. అందరినీ లోనికి అనుమతించకపోవడంతో బయటే పడిగాపులు పడుతున్నారు. ఎలాగైనా తాలిబన్ల నుంచి బయటపడాలని కష్టాలకోర్చుకుంటున్నారు.

Tags:    

Similar News