Earthquake in Mexico: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన మెక్సికో

* రిక్టర్ స్కేల్‌పై 6.9గా భూకంప తీవ్రత * గెరెరోకు ఆగ్నేయంగా 14కి.మీ దూరంలో భూకంప కేంద్రం

Update: 2021-09-08 10:00 GMT

మెక్సికో భారీ భూకంపం (ట్విట్టర్ ఫోటో)

Mexico Earthquake: భారీ భూకంపంతో మెక్సికో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్‌పై 6.9గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంప తీవ్రతకు భారీ బిల్డింగ్స్ సైతం ఊగిపోయాయి. మెక్సికో దేశంలోని గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్టుకు ఆగ్నేయంగా 14కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకూ భూకంప ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొంత మంది సిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 1995లోనూ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఆనాటి విపత్తులో దాదాపు 10వేల మంది మృత్యువాత పడగా వందలాది భవనాలు కుప్ప కూలాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో మెక్సికన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Tags:    

Similar News