Elon Musk: ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం.. స్వలాభం కోసమే అంటూ ట్రంప్ ఫైర్ !!
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. నేను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడని మస్క్ కామెంట్స్ చేస్తే..మస్క్ సపోర్ట్ లేకున్నా నేను గెలిచేవాడిని అంటూ ట్రంప్ ఎదురుదాడి చేశారు.
Elon Musk: ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం.. స్వలాభం కోసమే అంటూ ట్రంప్ ఫైర్ !!
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కింది. ట్రంప్ సంతకం చేసిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను ఎలోన్ మస్క్ నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించి ఎలోన్ మస్క్ వైఖరిపై నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటన తర్వాత, ఎలోన్ మస్క్ ఫైర్ అయ్యాడు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారన్నారు. ప్రతినిధుల సభపై డెమోక్రట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారంటూ ఎలాన్ మస్క్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంత్రుప్తికి గురయ్యానని..వైట్ హౌస్ లో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు.
మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడిని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్ లో స్పందించారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులు ప్రశ్నించారు. 80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ అడిగారు.