జీవితాన్నే మార్చేసిన నత్త..ఒక్కరోజులోనే కోటీశ్వరురాలిని చేసింది

Melo Pearl: సూది కోసం సోది కెడితే సుడి తిరిగిందంటారు.. ఒక్కోసారి అనుకోకుండానే అదృష్టం తన్నుకొస్తుంది..తలుపు తడుతుంది..

Update: 2021-03-27 12:07 GMT

Woman Finds Orange Melo Pearl 

Melo Pearl: సూది కోసం సోది కెడితే సుడి తిరిగిందంటారు.. ఒక్కోసారి అనుకోకుండానే అదృష్టం తన్నుకొస్తుంది.. తలుపు తడుతుంది.. ఆ టైమ్ లో మనం స్పందిస్తే.. మన జీవితం పూల బాటే అవుతుందంటుంటారు పెద్దలు.. అలాగే ఓ నిరుపేద యువతిని లక్షాధికారిని చేసిన సంఘటన ఇది.. ఊహించని అదృష్టం ఓ నత్త గుల్ల రూపంలో వరించింది. అదికూడా కేవలం 160 రూపాయల చిన్న పెట్టుబడితో..

థాయిలాండ్ లో భోజనం కోసం కొన్న నత్తలు ఓ యువతిని కోటీశ్వరురాలిగా మార్చేశాయి. ఏ మాత్రం నమ్మశక్యంగా లేని ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. సముద్రపు నత్తలను థాయ్ ప్రజలు అమితంగా తింటారు. ప్రస్తుతం అలాంటి నత్తే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే థాయ్‌ మహిళ రెండు నెలల క్రితం రాత్రి భోజనం కోసం చేపల మార్కెట్‌ నుంచి 160 రూపాయలు పెట్టి నత్తలను కొనుగోలు చేసింది. వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్‌ చేస్తుండగా.. ఓ నత్త కడుపులో ఆమెకు ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి లాంటి పదార్థం కనిపించింది. అదే ఆమెను రాత్రికి రాత్రి కోటీశ్వరురాలిగా మార్చేసింది.

ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని షాక్ అయిన కొడ్చకార్న్.. వెంటనే ఆమె తల్లికి చూపించింది. అనంతరం ఆమె తల్లి చెప్పిన గుడ్ న్యూస్ విని ఉక్కిరి బిక్కిరి అయింది. నిజానికి ఆమెకు దొరికింది మరేదో కాదు, ఓ అరుదైన ముత్యం. ఆరు గ్రాముల బరువుతో 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల ఆ ముత్యం అరుదైన మెలో జాతికి చెందింది. క్వాలిటీని బట్టి దాని ధర కోట్లలో ఉంటుంది. ఇదే విషయం కొడ్చకార్న్‌తో ఆమె తల్లి చెప్పింది. ఇంకేముంది జీవితంలో తనకున్న అన్ని సమస్యలు తీరిపోయినట్లే అని సంబరపడిపోతోంది ఈ థాయ్ చిన్నది.

మరోవైపు.. ఈ మెలో ముత్యం కొనుగోలు చేసేవారి కోసం ఎదురు చూస్తున్నట్లు కొడ్చకార్న్‌ తెలిపింది. వచ్చే డబ్బుతో తన అమ్మకు వైద్యం చేయిస్తా అంటోంది. క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె వైద్యానికి దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చవుతాయన్న కొడ్చకార్న్‌.. తన కష్టం చూసి ఆ దేవుడే కరుణించాడని సంతోషం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News