Afghanistan: కాబూల్ ఎయిర్ పోర్టు పేల్చివేతకు ఆత్మాహుతి దాడుల ప్రయత్నం

*నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా, బ్రిటన్,జర్మనీ దేశాలు *తమ దేశస్థులను ఎయిర్ పోర్టు వదిలి వెళ్లిపోవాలని సలహా

Update: 2021-08-26 11:14 GMT

కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం కనపిస్తోంది. ఆత్మాహుతి దళాలు కొన్ని ఎయిర్ పోర్టును పేల్చేసే ప్రణాళికలు రచిస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర గుమికూడిన తమ దేశ పౌరులందరినీ వెనక్కు వెళ్లిపోమని, సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాల్సిందిగా సూచించాయి. అయితే ఆప్ఘన్ పౌరులు మాత్రం ఈ హెచ్చరికలను లెక్క చేయడం లేదు.

ఎయిర్ పోర్టు పరిసరాల్లో దాదాపు 50 వేలమంది వరకూ ఉన్నట్లు సమాచారం. వెనక్కు తిరిగి వెళ్లే సాహసం చేయలేక అక్కడే ఎదురుతెన్నులు పడుతున్నారు. మరోవైపు నిన్న ఆస్ట్రేలియా దేశస్తుడిని తాలిబన్లు గాయపరిచిన నేపధ్యంలో తమ దేశ వాసులెవరూ అక్కడ ఉండొద్దని తక్షణం ఎయిర్ పోర్టును వదిలి వెళ్లిపోవాలనీ సూచించింది.

మరోవైపు ఆప్ఘనిస్థాన్ వైమానిక శాఖను అదుపులోకి తీసుకున్న తాలిబన్లు అక్కడ అమెరికా దళాలు ఇచ్చిన బ్లాక్ హాక్ చాపర్లను నడిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ అమెరికా దళాలు వదిలేసిన అన్ని ఆయుధాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకుని వాటిని వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Tags:    

Similar News