మహిళలపై ఆగని తాలిబన్ల అరాచకాలు.. వారికి బదులుగా మగవారిని పంపాలని హుకూం జారీ..

*మహిళలు ఉద్యోగాలు మానేయాలంటూ ఒత్తిడి

Update: 2022-07-19 11:12 GMT

మహిళలపై ఆగని తాలిబన్ల అరాచకాలు.. వారికి బదులుగా మగవారిని పంపాలని హుకూం జారీ.. 

Afghanistan: అప్ఘానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాము మారిపోయామని గతంలో వ్యహరించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించమంటూ నమ్మబలికారు. అయితే కుక్కతోక వంకర అన్నట్టుగా అధికారం కొద్దికాలంలోనే తమ అసలు రూపాయన్ని బయటపెడుతున్నారు. మహిళలపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తున్నారు. తాజాగా మహిళా ఉద్యోగులకు బదులుగా వారి బంధువులైన పురుషులను పంపాలని ఆదేశాలు జారీచేశారు. ఇటీవల తమ జీతాలను కూడా తగ్గించినట్టు అక్కడి మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టంలేకపోతే ఉద్యోగం మానేయాలంటూ నిర్మొహమాటంగా చెబుతున్నట్టు వాపోతున్నారు.

అయితే మహిళలకు బదులుగా వారి బంధువులైన పురుషులను పంపితే వారు సదరు విధులను ఎలా నిర్వర్తిస్తారన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అర్హత, నైపుణ్యమున్న వారి స్థానంలో ఎలాంటి నైపుణ్యంలేని వారిని నియమిస్తే ఎలా పని చేస్తారనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళా విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు పలు చిత్రమైన ఆంక్షలను విధిస్తున్నారు. మహిళ బయటకు వస్తే తప్పనిసరి బురఖా ధరించాలని కుటుంబంలోని ఓ మగతోడును తీసుకురావాల్సిందేనని హుకూం జారీ చేశారు. వార్తలు చదివే యాంకర్లు ముఖానికి హిజాబ్‌ వేసుకోవాల్సిందేనని ఆంక్షలు పెట్టారు. ఆఫ్ఘాన్‌లోని మహిళా ఉద్యోగలపై ఆంక్షల కారణంగా ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దేశం మొత్తం పేదరికంతో విలవిలలాడుతోంది. ఆర్థిక సంక్షోభంలో మగ్గుతున్న ఆప్ఘాన్‌లో తీవ్ర ఆహార కొరత నెలకొన్నది.

Full View
Tags:    

Similar News