Suspicious Patient Found in South Korea: ఉత్తరకొరియాలో మొదటి కరోనా కేసు.! లాక్ డౌన్ ఆదేశాలు ఇచ్చిన కిమ్

Update: 2020-07-26 08:54 GMT

Suspicious Patient Found in South Korea: ప్రపంచమంతా కరోనా వ్యాధి ప్రబలింది. కొన్ని దీవులు తప్ప కరోనా కేసు లేని దేశాలు లేవంటే అతియోశక్తి కాదు. చైనా, దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగానే వచ్చాయి. కానీ పక్కనే ఉన్న ఉత్తరకొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు రాలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రారంభమైన 7 నెలల తరువాత ఉత్తర కొరియాలో మొదటి కరోనా సుస్పెక్టెడ్ కేసు వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన నియంత కిమ్ జోంగ్ ఉన్.. దక్షిణ కొరియా ప్రక్కనే ఉన్న కీసాంగ్ నగరాన్ని లాక్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మీడియా ప్రకారం, కరోనా భారిన పడిన వ్యక్తి ఆ దేశం నుంచి పారిపోయారు.. మూడేళ్ల క్రితం ఉత్తర కొరియా నుంచి అతను పారిపోయి.. తిరిగి జూలై 19 న అతను అక్రమంగా సరిహద్దు దాటి దేశానికి చేరుకున్నాడు.

ఈ విషయం తెలియగానే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ శనివారం పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కీసాంగ్‌లో అత్యవసర పరిస్థితులతో పాటు టాప్ క్లాస్ హెచ్చరికలను జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ రోగి తో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా గుర్తించారు. దీంతో ప్రస్తుతం వారిని నిర్బంధంలో ఉంచినట్టు ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేసింది. 

Tags:    

Similar News