Corona Can Infect through Ear: ముక్కు, నోరు ‌నుంచే కాదు.. చెవుల ద్వారా కూడా!

Corona Can Infect through Ear: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క‌రోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. మ‌రోవైపు శాస్త్రవేత్తలకు రోజుకో సవాల్ విసురుతూనే ఉంది.

Update: 2020-07-25 13:59 GMT
Study reveals Corona virus can infect ears

Corona Can Infect through ఎఆర్ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క‌రోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. మ‌రోవైపు శాస్త్రవేత్తలకు రోజుకో సవాల్ విసురుతూనే ఉంది. ఇప్పటివరకు ముక్కు, గొంతు ద్వారా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని అనుకున్నారు. కానీ తాజా అధ్యయనం మాత్రం చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

ఇటీవల జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విష‌యం తేలింది. చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరస్ ఉ‍న‍్నట్టు గుర్తించారు. క‌రోనాతో మరణించిన రోగులపై హెడ్‌ అండ్‌ నెక్‌ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మస్టాయిడ్(కర్ణభేరి) ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చారు. అలాగే కరోనా తీవ్రత పెరిగినప్పుడు రోగి శరీరం నుంచి వైరస్ చెవుల్లోకి వెళుతోందా..? లేక చెవుల నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుందా..? అన్న సందేహాలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరికొంతమందిని పరిశీలిస్తే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదని వారు అంటున్నారు. ప్రస్తుతానికి చెవులను మూసుకోవడమే మేలని వారు చెబుతున్నారు.

కరోనా టెస్టులు చేస్తున్న వైద్య బృందాలకు.. చెవుల స్వాబ్‌ను కూడా పరిశీలించాలని ఈ అధ్యయన బృందం సూచించింది. అయితే గతంలో ( ఏప్రిల్, 2020) జరిగిన ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు. వినికిడి సమస్యలు లేనివాళ్లలో కూడా కరోనా సోకిన తరువాత వినికిడి శక్తిలో మార్పు వచ్చినట్లు మరి కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.

Tags:    

Similar News