సులేమానీ అంతిమయాత్రలో అపశృతి

ఇరాన్‌లో శుక్రవారం అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ మృతిచెందిన విషయం తెలిసిందే.

Update: 2020-01-07 12:02 GMT
Qasem Soleimani Funeral

ఇరాన్‌లో శుక్రవారం అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే సులేమాని అంత్యక్రియల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సులేమానీ అంతిమయాత్రలో లక్షలాది మంది తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35మంది మరణించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మరో 48 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

సులేమానీ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలం కెర్మన్‌కు మంగళవారం తీసుకొచ్చారు. కాగా.. ఆయను నివాళులర్పించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరో 48 మంది గాయపడ్డారు. ఈ ఘనటను ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీస్ అధికారి పీర్ హోస్సెన్ ద్రువీకరిచారు. దీని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేశారు. తొక్కిసలాటలో కొందరు తమను కాపాలడాలంటూ ఆర్త నాదాలు చేశారు.

అమెరికా జరిపిన డ్రోన్ దాడిల్లో అతను ప్రాణాలు కొల్పోయారు. సోమవారం సులేమాని మృతదేహాన్ని టెహ్రాన్ తీసుకొచ్చారు. మంగళవారం టెహ్రాన్ లోని లక్షలాది మంది చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇరాన్ కు అత్యంత కీలకమైన 52 ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు చెబుతూ అయన త్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరాన్ మసీద్ పై ఎర్రజెండా ఎగురవేయటం, ట్రాంప్ హెచ్చరికలు జరీ చేయడం వంటి పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు రేపాయి. ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయనే సందేహాలూ ఉన్నాయి.

 

Tags:    

Similar News