కరోనా వైరస్ తో స్పెయిన్ యువరాణి మృతి

కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ 195 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.

Update: 2020-03-29 09:05 GMT
Maria Teresa (File Photo)

కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ 195 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఐరోపా దేశాల్లో క్రమక్రమంగా ఈ వైరస్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక ఇటలీలో అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికి పది వేల మంది మరణించారు.

ఇక ఇదిలా ఉంటే స్పెయిన్ దేశంలోని రాజ కుటుంబానికి చెందిన మారియా థెరీసా (86) కరోనాతో  పోరాడుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు సీక్టొ హెన్రీక్ డీ బర్బాన్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. స్పెయిన్ రాజ కుటుంబానికి చెందిన మారియా థెరిసాకి ఇటివల కరోనా సోకింది. దీనితో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మారియా థెరిసాకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. ఈమెకు సంతానం మాత్రం లేరు. 

ఇక భారత్ లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు 979కి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. మొత్తం ఈ వైరస్ బారిన పడి 25 మంది మృతి చెందారు.

 

Tags:    

Similar News