SpaceX Inspiration: స్పేస్ ఎక్స్ ఇన్‌స్పిరేషన్ స్పేస్ టూర్ సూపర్ సక్సెస్

* విజయవంతంగా ముగిసిన ఇన్‌స్పిరేషన్ 4 ప్రయోగం * మూడు రోజుల పాటు కక్ష్యలో గడిపిన టూరిస్టులు

Update: 2021-09-19 14:30 GMT

 ఇన్‌స్పిరేషన్ 4 (ట్విట్టర్ ఫోటో)

SpaceX Inspiration: స్పేస్ ఎక్స్ ఇన్ స్పిరేషన్ స్పేస్ టూర్ సూపర్ సక్సెస్ అయింది. మూడు రోజుల పాటు అంతరిక్షంలో భూకక్ష్యలో గడిపిన నలుగురు సామాన్యులు తిరిగి భూమ్మీదకు వచ్చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో వారి క్రూ క్యాప్సూల్ డ్రాగన్ సురక్షితంగా దిగింది. పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్లు లేకుండానే నలుగురు సామాన్యులు రోదసీలోకి వెళ్లిరావడం ఇదే తొలిసారి కావడం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లయింది. 'ఇన్ స్పిరేషన్ 4' పేరుతో ఎలాన్ మస్క్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ మూడురోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఫాల్కన్ 9 హెవీ రాకెట్ ద్వారా డ్రాగన్ క్రూ క్యాప్సూల్ లో జరెడ్ ఐజాక్ మ్యాన్, క్రిస్ సెంబ్రోస్కీ, హేలీ ఆర్బినో, సియాన్ ప్రోక్టర్ లు అంతరిక్షంలోకి వెళ్లారు. నిజానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 420 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది. కానీ, ఈ ప్రయోగంలో భాగంగా దాని కన్నా ఎత్తులో డ్రాగన్ క్యాప్సూల్ కక్ష్యలోకి వెళ్లింది. 575 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరిగింది. గంటకు 27వేల 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన డ్రాగన్.. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేసింది. ఈ ప్రయోగం సక్సెస్ తో మానవసహిత అంతరిక్ష యాత్రల్లో మరో కీలక ముందడుగు పడినట్టయింది.

Tags:    

Similar News