ముగిసిన సూర్యగ్రహణం

Update: 2019-12-26 06:16 GMT
ముగిసిన సూర్యగ్రహణం

ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్‌, సౌదీ, సింగపూర్‌ దేశాల్లో సూర్యగ్రహణం కనిపించింది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించాయి.

కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించింది. 

Tags:    

Similar News