వైద్యో నారాయణో హరీ.!! 212 గ్రాముల బరువు పాపకు 13 నెలల పాటు చికిత్స

* ఇప్పుడు 6.3 కిలోలకు చేరిక * ఆస్పత్రి నుంచి పాప డిశ్చార్జ్

Update: 2021-08-10 03:15 GMT

క్వెక్‌ యుగ్జాన్ (ట్విట్టర్ ఫోటో)

Singapore: ఆ పాప పేరు క్వెక్‌ యుగ్జాన్‌. తల్లి గర్భంలో 40 వారాల పాటు ఎదగాల్సిన పాప 25 వారాలకే భూమి మీదకొచ్చేసింది. అప్పుడు పాప బరువు 212 గ్రాములు. పొడవు 24 సెంటీమీటర్లు. ఇంత చిన్న పాపను చూసి వైద్యులే షాకయ్యారు. ప్రపంచంలోనే అతి చిన్న పాపగా గుర్తించారు. చిన్న పిల్లల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. అక్కడ ఆ పాప ఆకృతికి తగ్గట్లు ఆక్సిజన్‌ అందించే పైప్‌ సహా మందుల పరిమాణాన్ని తగ్గించారు. ఆ చిన్నారి అతి సున్నితమైన చర్మాన్నిసున్నితంగా హ్యాండిల్ చేశారు.

వైద్యులు అనుక్షణం కష్టించి కంటికి రెప్పలా కాపాడారు. ఇలా మొత్తం 13 నెలల పాటు చికిత్స అందించారు. అందులో ఎక్కువ కాలం వెంటిలేటర్‌ పైనే ఉంచారు. ఇప్పుడు చిన్నారి బరువు 6.3 కేజీలకు చేరుకుంది. ఇక అంతా ఓకే అనుకున్న వైద్యులు పాపను డిశ్చార్జి చేశారు. 212 గ్రాముల నుంచి 6.3 కేజీలకు ఎదిగిన చిన్నారి క్వెక్‌ను చూసి వైద్యులు మురిసిపోతున్నారు. పాపకు ఇప్పటికీ వైద్యం అవసరమేనని, ఇంటి నుంచే చికిత్స తీసుకోవచ్చని వెల్లడించారు.

Tags:    

Similar News