Sheikh Hasina: షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా‌కు (Sheikh Hasina) ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2025-07-02 09:48 GMT

Sheikh Hasina: షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష..!

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా‌కు (Sheikh Hasina) ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్షను విధించినట్లు బంగ్లాదేశ్‌ మీడియా నివేదికలు వెల్లడించాయి.

గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దేశం విడిచి భారత్‌కు వలస వెళ్లినట్లు సమాచారం. అప్పటి ఆమెకు తోడుగా ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేర ఆరోపణలు నమోదు కాగా, ఇటీవల ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా‌కు కోర్టు శిక్ష విధించడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News