అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, ఏడుగురి మృతి

* కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండు చోట్ల కాల్పులు

Update: 2023-01-24 03:26 GMT

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, ఏడుగురి మృతి

America: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌ వద్ద జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.

Tags:    

Similar News