Plane Crash: కూలిన రష్యా విమానం.. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం..!
Plane Crash: ఖైదీల మార్పిడిలో భాగంగా బెల్గోరోడ్‌కు తరలిస్తుండగా ప్రమాదం
Plane Crash: కూలిన రష్యా విమానం.. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం..!
Plane Crash: రష్యా మిలటరీ విమానం ఐఎల్-76 ఘోర ప్రమాదానికి గురయ్యింది. విమానంలోని మొత్తం 90 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 65 మంది ఖైదీలు కాగా, మిగిలిన వారు రష్యన్ ఆర్మీకి చెందిన సైనికులుగా తెలుస్తోంది. ఇక ఖైదీలంతా యుద్దంలో పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడికి ఒప్పందం కుదరింది. అందులో భాగంగా రష్యన్ మిలటరీ విభాగం ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరోడ్‌కు తరలించింది. బెల్గోరోడ్ రిజియన్ ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో ఉంటుంది.
అక్కడికి సైన్యాన్ని తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. అయితే విమాన ప్రమాదానికి కారణాలను తెలియరాలేదు. ఈ విషయమే ప్రత్యేక మిలటరీ కమిషన్ దర్యాప్తు చేస్తున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. సంఘటనా స్థలంలో అత్యవసర సేవల విభాగం, దర్యాప్తు సిబ్బంది పని చేస్తున్నట్టు బెల్గోర్డో గవర్నర్ వ్యాచెస్లవ్ గ్లాడ్కోవ్ వెల్లడించారు.