Russia: యుద్ధ సమయంలోనూ రష్యాకు కాసుల పంట

Russia: 100 రోజుల్లో 9,750 కోట్ల డార్ల సంపాదన

Update: 2022-06-13 15:00 GMT

Russia: యుద్ధ సమయంలోనూ రష్యాకు కాసుల పంట

Russia: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. కానీ యుద్ధం చేస్తున్న రష్యాకు మాత్రం కాసుల వర్షం కురిసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలను బద్దలు కొట్టుకుని నూరు రోజుల యుద్ధ సమయంలో ఏకంగా 9వేల 750 కోట్ల డాలర్లను అర్జించింది. ఈ ఆదాయంలో అత్యధికంగా 61 శాతం ఐరోపా సమాఖ్య దేశాల నుంచే వచ్చింది. అంటే దాదాపు 6వేల కోట్ల డాలర్ల ఆదాయం రష్యాకు వచ్చింది. తాజాగా ఈ వివరాలను ఫిన్లాండ్‌కు చెందిన సెంటర్‌ ఫర్ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌-సీఆర్‌ఈఏ ఆ మేరకు నివేదికను విడుదల చేసింది. దిగుమతుల్లో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నట్టు తెలిపింది.

రష్యా నుంచి చైనా భారీగా చమురును దిగుమతి చేసుకుంది. అత్యధికంగా 13 వందల 20 కోట్ల డాలర్ల విలువైన క్రూడాయిల్‌ చైనాకు రష్యా పంపింది. ఇక జర్మనీ 12 వందల 68 కోట్లు డాలర్లు, ఇటలీ 817 కోట్ల డాలర్లు, భారత్‌ 356 కోట్ల డాలర్లను రష్యాకు చెల్లించాయి. రష్యాకు వచ్చిన ఆదాయంలో క్రూడాయిల్‌ నుంచే 4 వేల 820 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది. ఇక బొగ్గు, గ్యాస్‌, చమురు ఉత్పత్తుల నుంచి మిగతా ఆదాయం వచ్చినట్టు సీఆర్‌ఏఈ తెలిపింది. అయితే రష్యా ఆదాయానికి అమెరికా, పోలాండ్‌ భారీగా దెబ్బతీశాయి. దీనికి తోడు ముడి చమురుపై రాయితీ ప్రకటించడంతో 20 కోట్ల 90 లక్షల డాలర్ల మేర ఆదాయానికి గండీ పడింది.

Tags:    

Similar News