ఉక్రెయిన్‌లో నరమేధం సృష్టించిన రష్యా

Ukraine - Russia: పౌరులను అత్యంత కిరాతకంగా చంపేసిన పుతిన్‌ సేనలు

Update: 2022-04-05 04:49 GMT

ఉక్రెయిన్‌లో నరమేధం సృష్టించిన రష్యా

Ukraine - Russia: ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు సాగించిన ఊచకోత దారుణ మారణకాండను తలపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీప నగరమైన బుచాలో 300 మందికి పైగా పౌరులను అత్యంత కిరాతకంగా రష్యా సైన్యం ఊచకోత కోసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. అంతేకాకుండా బోరోడ్యాంకా, ఇతర పట్టణాల్లో సాధారణ పౌరుల మరణాల సంఖ్య లెక్కకు మించి ఉండొచ్చని ఉక్రెయిన్ చెబుతోంది. మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు, పట్టణాల్లో బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. అయితే ఇప్పటికే రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు రష్యా సైన్యం అకృత్యాలకు సాక్షంగా నిలుస్తున్నాయి.

ఉక్రెయిన్‌తో పాటు పాశ్చాత్య దేశాల కూటమి రష్యా దమనకాండను ఖండిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడంతో పాటు యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా దర్యాప్తునకు ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని కోరాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా ఈ మారణహోమంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరాలను ఎన్నడూ చేడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రష్యా దురాగతాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.

Tags:    

Similar News