Japan Earthquake: జపాన్ భూకంపంలో 64 మంది మృతి

Japan Earthquake: శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

Update: 2024-01-03 13:47 GMT

Japan Earthquake: జపాన్ భూకంపంలో 64 మంది మృతి

Japan Earthquake: జపాన్‌లో భూకంప సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంపం తాకిడికి ఇప్పటి వరకు 64 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 62 మంది మృత దేహాలను గుర్తించారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. జపాన్‌లోని నోటో ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమైంది. వేలాది భవనాలు కుప్పకూలాయి.

మరికొన్ని ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనల్లో 62 మంది మృతి చెందడంతోపాటు మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 32 వేల మంది నిరాశ్రయులుగా మారారు.. వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. తీరప్రాంతంలోని సుజు పట్టణంలో దాదాపు 90 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి. జపాన్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.

Tags:    

Similar News