Cyclone Alfred: తుఫాన్ బీభత్సం.. అంధకారంలో 3లక్షల మంది.. 13 మంది సైనిక సిబ్బందికి గాయాలు

Cyclone Alfred: ఆస్ట్రేలియాలో ఆల్ఫ్రెడ్ తుఫాను బీభత్సం సృష్టించింది. గంటకు 107 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ తుఫాను క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ (NSW)లలో భారీ విధ్వంసం సృష్టించింది.

Update: 2025-03-09 01:46 GMT

Cyclone Alfred: తుఫాన్ బీభత్సం.. అంధకారంలో 3లక్షల మంది.. 13 మంది సైనిక సిబ్బందికి గాయాలు

Cyclone Alfredఆస్ట్రేలియాలో ఆల్ఫ్రెడ్ తుఫాను బీభత్సం సృష్టించింది. గంటకు 107 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ తుఫాను క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ (NSW)లలో భారీ విధ్వంసం సృష్టించింది. భారీ వరదల కారణంగా ఒకరు మరణించగా, 13 మంది సైనికులు గాయపడ్డారు. 3 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

క్వీన్స్‌ల్యాండ్‌లో 287,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూ సౌత్ వేల్స్‌లో 42,600 కంటే ఎక్కువ ఇళ్లు విద్యుత్తు సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నారు. బలమైన గాలుల కారణంగా వందలాది చెట్లు కూలిపోయాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్‌లలో భారీ వర్షాలు, వరదలు మరో సంక్షోభాన్ని సృష్టించాయి. 1000 కి పైగా పాఠశాలలు మూసివేశారు అధికారులు. ప్రజా రవాణా, విమాన సర్వీసులు అన్నీ కూడా నిలిచిపోయాయి. ఎలక్టివ్ సర్జరీలు కూడా రద్దు చేశారు.

61 ఏళ్ల వ్యక్తి కారు వరద నీటిలో చిక్కుకుంది. అతను కారు దిగి చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు అత్యవసర బృందం కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శనివారం పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు. లిస్మోర్‌లో సహాయ చర్యలు చేపట్టేందుకు వెళ్తున్న 13 మంది సైనికులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఒక ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది, ఆ తర్వాత మరో ట్రక్కు దానిని ఢీకొట్టింది. లక్షలాది మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి; ప్రమాదం ఇంకా ముగియలేదు" అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ హెచ్చరించారు. "తుఫాను బలహీనపడింది కానీ దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది" అని న్యూ సౌత్ వేల్స్ ముఖ్యమంత్రి క్రిస్ మిన్స్ హెచ్చరించారు.

గోల్డ్ కోస్ట్‌లోని ఒక పార్కు వద్ద కూలిన చెట్టు రెండు క్యాబిన్‌ల మధ్య కూలిపోయింది. మూడవ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతింది. సముద్ర తీరంలో ఇసుక కొట్టుకుపోయింది. దీనివల్ల అక్కడ నీరు నేరుగా ప్రవహించింది. బలమైన గాలులు , వర్షం ఇంకా కొనసాగుతున్నందున తుఫాను తగ్గే వరకు శుభ్రపరిచే కార్యకలాపాలు జరగడం కష్టంగా ఉందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News