Rain inside the cabin on Russian Flight: విమానంలో వర్షం.. వైరస్ అయిన వీడియో

Rain inside the cabin on Russian Flight ఇంతవరకు మనం ఆర్టీసీ బస్సుల్లోనే వర్షం కురవడం చూశాం... వర్షం వచ్చిందంటే చాలు..

Update: 2020-07-13 02:45 GMT
Rain inside the Flight Cabin

Rain inside the cabin on Russian Flight ఇంతవరకు మనం ఆర్టీసీ బస్సుల్లోనే వర్షం కురవడం చూశాం... వర్షం వచ్చిందంటే చాలు.. చేతిలో గొడుగులుంటే బస్సుల్లో ఉంటే వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సంఘటనలు తాజాగా విమానంలో చోటు చేసుకుంది. గాలిలో ఎగిరే విమానంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే తిరిగి వారు క్షేమంగా కిందకు చేరేది. అలాంటిది విమానంలోనే కారితే ఇక తమ బతుకులు ఎలా అంటూ ప్రయాణికులు ఆందోళన చెందారు.

రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సోచికి బయల్దేరారు. అలా విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే భారీగా వర్షం కురవడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా విమానం క్యాబిన్లోకి వర్షపు నీరు రావడం షురూ కావడంతో విమాన సిబ్బంది తమ గొడుగులకు పనిచెప్పారు.

కాగా.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ సంఘటన అనంతరం రష్యా ఎయిర్‌లైన్స్ అధికారులు జరిపిన దర్యాప్తులో నిజం బయటపడింది. క్యాబిన్‌లో నీరు లీకేజీకి కారణం వర్షం కాదని, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లనే అని తేల్చారు.

Tags:    

Similar News