Putin: పశ్చిమ దేశాలు తగ్గేవరకూ తాను తగ్గనన్న పుతిన్
Putin: బైడెన్ రహస్య పర్యటనపైనా పుతిన్ పవర్ పంచ్‌లు
Putin: పశ్చిమ దేశాలు తగ్గేవరకూ తాను తగ్గనన్న పుతిన్
Putin: బైడెన్ సీక్రెట్ టూర్‌పై రష్యన్ ప్రెసిడెంట్ తనదైన రియాక్షన్ ఇచ్చారు. రష్యా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్.. పాశ్చాత్య దేశాలు తమ బాటిల్ నుంచి భూతాన్ని బయటికి వదిలాయని బైడెన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఉక్రెయిన్ భుజంపై తుపాకీ పెట్టిన పాశ్చాత్య దేశాలు తమతో యుద్ధం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాలతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి, శాంతి మార్గాన్ని అనుసరించాలని తాము అనుకుంటున్నామని, తమ ఆలోచనకు భిన్నంగా వెస్ట్రన్ కంట్రీస్ వ్యవహరిస్తోన్నాయని ధ్వజమెత్తారు.
ఈ ప్రయత్నంలో పలు సమాధానాలు లభించినప్పటికీ.. వాటిల్లో నిజాయితీ లోపించిందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ను పాశ్చాత్య దేశాలు తమపై ఎంత ఎక్కువగా రెచ్చగొడితే తాము కూడా అంతే దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదని, ఉక్రెయిన్ తరఫున శాంతి చర్చలకు పాశ్చాత్య దేశాలకు పూనుకోవాలంటూ ఆయన సూచించారు.