Modi joins Truth Social: ట్రూత్ సోషల్ లో చేరిన ప్రధాని మోదీ..మొదటి పోస్టు ఏం పెట్టారో తెలుసా?
Modi joins Truth Social: ప్రపంచంలోని బలమైన నాయకుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. కొన్ని విషయాల్లో వీరిద్దరి మధ్య పాలనాపరమైన వైరుధ్యాలు చాలానే ఉన్నాయి. అయితేనేం ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు అభమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. మొదట ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్ మాన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ పాల్గొన్న ఇంటర్వ్యూను డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా నెట్ వర్క్ ట్రూత్ సోషల్ షేర్ చేశారు.
ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రధాని మోదీ కూడా ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్ వర్క్ లో చేరారు. అనంతరం తన మొదటి ట్రూత్ ఇలా రాస్తూ..ట్రూత్ సోషల్ లో చేరినందుకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉద్వేగభరితమైన, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని పోస్టు పెట్టారు ప్రధాని మోదీ.
ఇదే సందర్భంగా తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూను షేర్ చేసినందుకు డొనాల్డ్ ట్రంప్ కు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మిత్రుడు, అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరికత ద్రుక్పథం, ప్రపంచ సమస్యలు, మరిన్నింటితో సహా విస్త్రుత శ్రేణి అంశాలను నేను ఇక్కడ చర్చించాను అని ట్రంప్ ఇంటర్వ్యూను షేర్ చేసుకున్న పోస్టుకు ప్రధాని మోదీ బదులిచ్చారు.
అంతకు ముందు లెక్స్ ఫ్రిడ్ మాన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ పాలన, ఆయనతో స్నేహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పరస్పర విశ్వాసం అనే బంధాన్ని పంచుకున్నాను. మా ఇద్దరికీ జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఇదే సర్వోన్నతమని మేమ ఇద్దరం భావిస్తున్నాము. అందుకే కావచ్చు మా ఇద్దరి మధ్య స్నేహం, అనుబంధం కొనసాగుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మదిలో అమెరికా డెవలప్ మెంట్ పై స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా ఉంది. ట్రంప్ పై కాల్పులు జరిగిన సమయంలోనూ నేను ఆయనలో హుషారు, ద్రుఢసంకల్పాన్ని చూశాను అని ట్రంప్ గురించి చెప్పుకొచ్చారు మోదీ.