టర్కీ, సిరియాలో భూ విలయం.. 3,800 మందికి పైగా దుర్మరణం..

* పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు

Update: 2023-02-07 02:44 GMT

టర్కీ, సిరియాలో భూ విలయం

Turkey: వరుస భూ కంపాలతో టర్కీ, సిరియా దేశాలు విలవిల్లాడాయి. దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపంనలు బీభత్సం సృష్టించాయి. భూ కంప ప్రభావంతో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భవన శిథిలాల కింద వేలమంది చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడని పరిస్థితితో శిథిలాల్లోనే ప్రాణాలు విలవిల్లాడాయి. దీంతో ఇరు దేశాల్లో 2 వేల500 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఎటుచూసినా భవన శిథిలాలు శవాలగుట్ట హృదయ విదారకంగా మారాయి. భవన శిథిలాల కింద గాయపడిన వారి రోధనలు పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రతి ఒక్కరూ ఆపన్న హస్తం అందించే వారికోసం ఎదురుచూసే పరిస్థితిలో ఒకరినొకరు కాపాడే పరిస్థితి కరువైంది.

వేకువజాము సమయాన గాఢ నిద్రలో ఉన్న వేళ భూ ప్రళయంతో వారందరినీ శాశ్వత నిద్రగా మిగిలింది. టర్కీలో తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం సంభవించింది భూ కంప తీవ్రత సిస్మోగ్రాఫ్ పై 7.8 గా నమోదైంది. తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు భూమి కంపించింది. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించిం భూకంపంతో వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నష్టం మొత్తం టర్కీ జీడీపీలో రెండు శాతం వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సిరియాలోనే అత్యధికంగా మృతి చెందినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక శిథిలాల్లో చిక్కుకుని వేల మంది గాయాలపాలయ్యారు. శిథిలాల కింద భారీగానే క్షతగాత్రులున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని టర్కీ అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్ లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, భారీ భూకంపం తర్వాత కూడా బలమైన భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొంది. కనీసం 18 సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఏళ్ల తరబడి అతలాకుతలమవుతున్న సిరియా తాజా భూ ప్రకంపనలతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిరియా దేశ పరిసరాల్లో తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 40 లక్షలమంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ఇది వరకే బాంబుపేలుళ్ల ధాటికి దెబ్బతిన్న భవనాలు, తాజా విపత్తుతో మరింతగా ధ్వంసమయ్యాయి. మధ్యదరా సముద్రంలోని ద్వీపదేశం సైప్రస్ సహ లెబనాన్ వంటి అనేక దేశాల్లో వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్నాయి.

Tags:    

Similar News