కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
Kaleshwaram Project: పిటిషన్ దాఖలు చేసిన టీపీసీసీ ఎలక్షన్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు టీపీసీసీ ఎలక్షన్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశాలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ పిటిషన్‌లో తెలిపారు. నిరంజన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.