Anti-Hamas protest: గాజాలో ఒక్కసారిగా మారిపోయిన సీన్.. హమాస్‌కు వ్యతిరేక నిరసనలు

Update: 2025-03-26 07:51 GMT

Anti-Hamas protest: గాజాలో ఒక్కసారిగా మారిపోయిన సీన్.. హమాస్‌కు వ్యతిరేక నిరసనలు

Hamas faces protests from Palestinians in Gaza strip: గాజాలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్‌తో హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు మూన్నాలుగు దశాబ్ధాలుగా హమాస్‌కు మద్ధతుగా నిలిచిన పాలస్తినా వాసులు తాజాగా వారికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. మాకు ఈ యుద్ధం వద్దు.. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ పాలస్తినా వాసులు నినాదాలు చేశారు.

హమాస్ ఉగ్రవాదులు ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేశారు. హమాస్ నేతలు అధికారంలోకి దిగిపోండి అని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. గాజాలో ఉత్తర భాగంలో ఉన్న బీట్ లహియాలో మంగళవారం ఈ ఆందోళనలు జరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గాజా హమాస్‌కు కంచు కోట. హమాస్ నేతలే అక్కడ పాలన కొనసాగిస్తున్నారు. లెబనాన్, పాలస్తినా తరపున ఇజ్రాయెల్‌తో హమాస్ యుద్ధం చేస్తోంది. దశాబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ యుద్ధంలో లెబనాన్, పాలస్తినా ఎంతో నష్టపోయింది. అన్నిరకాలుగా చితికిపోయింది. ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఆకలి చావులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టండి అంటూ పాలస్తినా వాసులు హమాస్‌కు వ్యతిరేకం అయ్యారు.

ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలయ్యాక హమాస్‌కు వ్యతిరేకంగా ఇంత భారీ స్థాయిలో నిరసనలు జరగడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తూ ఇన్నేళ్లపాటు గాజాను శాసించిన హమాస్‌కు ఇది ఊహించని షాక్ ఇచ్చింది.

Tags:    

Similar News