Operation Sindoor: భారత్ దెబ్బ అట్లుంటది మరీ..ఆపరేషన్ సింధూర్ తో చాలా నష్టపోయాం..నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని
Operation Sindoor: భారత్ దెబ్బ అట్లుంటది మరీ..ఆపరేషన్ సింధూర్ తో చాలా నష్టపోయాం..నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ న్యూస్ తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు తన నిజాన్ని ఒప్పుకుంది. పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చేసిన పాకిస్తాన్ పాలకులు వాస్తవాన్ని అంగీకరించారు. భారత్ చేసిన దాడులు ఎలా ఉన్నాయో స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రతపై షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ చేసిన దాడులను తొలిసారిగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పినట్లు ప్రధాని షరీఫ్ తెలిపారు. మే 10వ తేదీన తెల్లవారుజామున 2.30 కిపాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని పాకిస్తాన్ ప్రధాని తెలిపారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తన చెప్పారని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 7 నుంచి 11 మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నిరంతరం డ్రోన్స్ , క్షిపణులతో భారత్ పై దాడికి పాల్పడింది. దీనికి భారత సైన్యంకూడా గట్టి సమాధానం ఇచ్చింది. భారత్ తీసుకున్న ప్రతీకార చర్యపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రకటన చేశారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇతర స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల గురించి జనరల్ ఆసిమ్ మునీర్ తెల్లవారుజామున 2.30గంటలకు ఫోన్లో తనకు సమాచారం అందించారని ఆయన తెలిపారు. భారత్ కాల్పుల విరమణను ప్రతిపాదించిందని పేర్కొన్నారు.